యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సుమారు మూడొందల మీటర్ల మేర వాహనాలు ఉండిపోయాయి. భారీ వర్షంలో గంటపాటు అదే పరిస్థితి నెలకొంది. ఉదయం విజయవాడ వైపు ట్రాఫిక్ స్తంభించగా... సాయంత్రానికి హైదరాబాద్ వైపు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది.
ప్రయాణికులకు గమనిక... పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్
వారాంతం కావడం... శుభకార్యాల సమయం... మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షం వెరసి పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. సుమారు మూడు వందల మీటర్లు వాహనాలు నిలిచిపోయాయి.
traffic
వారాంతంలో స్వగ్రామాలకు వెళ్లిన వారంతా జంట నగరాలకు తిరుగుముఖం పట్టడంతోపాటు... శుభకార్యాల వల్ల రాకపోకలు ఎక్కువయ్యాయి. ఇక మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై కురిసిన వర్షం వల్ల... పలు చోట్ల వాహనాలు నిదానంగా ప్రయాణించాల్సి వచ్చింది.
ఇదీ చూడండి:INTER RESULTS: రేపు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు