తెలంగాణ

telangana

ETV Bharat / state

వెంటాడుతున్న లాక్​డౌన్ భయం.. టోల్‌ప్లాజాల వద్ద వాహనాల బారులు - పంతంగి వద్ద భారీగా వాహనాల బారులు

heavy traffic at panthangi toll plaza
పంతంగి టోల్‌ప్లాజా వద్ద అర కిలోమీటరు మేర వాహనాల బారులు

By

Published : Jun 30, 2020, 7:06 PM IST

Updated : Jun 30, 2020, 10:07 PM IST

19:04 June 30

వెంటాడుతున్న లాక్​డౌన్ భయం.. టోల్‌ప్లాజాల వద్ద వాహనాల బారులు

హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​ విధిస్తారన్న ఉహాగానాల నేపథ్యంలో సొంతూళ్లకు పయనమయ్యే వారి సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్​ ప్లాజా వద్ద మంగళవారం సాయంత్రం రద్దీ నెలకొంది. రోజూ వెళ్లే వాహనాల కంటే.. వెయ్యికి పైగా వాహనాలు టోల్​ ప్లాజా దాటినట్లు సిబ్బంది చెబుతున్నారు. 

         ఫాస్టాగ్​ మార్గాల్లో రద్దీ లేకున్నా.. టికెట్​ కౌంటర్​ వరుసలో వాహనాలు బారులు తీరాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో ఇప్పటికే పెద్దఎత్తున కరోనా కేసులు బయటపడుతున్న దృష్ట్యా.. స్వగ్రామాలకు వెళ్లేవారితో వైరస్​ వ్యాప్తి అధికమయ్యే అవకాశం అందని ఆరోగ్య శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

Last Updated : Jun 30, 2020, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details