యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, నారాయణపురం మండల కేంద్రాల్లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ నియంత్రణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి అమలు చేయనున్న లాక్డౌన్ దృష్ట్యా.... మద్యం ప్రియులు వైన్సులకు పరుగులు తీశారు. గతేడాది మాదిరిగా మద్యం దొరకక ఇబ్బందులు పడకూడదని ముందుజాగ్రత్త పడుతున్నారు.
మందుబాబుల తాకిడితో వైన్సుల ముందు సందడి వాతావరణం - lock down in yadadri
రేపటి నుంచి రాష్ట్రంలో అమలుకానున్న లాక్డౌన్ నేపథ్యంలో మందుబాబులు ముందు జాగ్రత్త పడుతున్నారు. మద్యం కోసం గతేడాది ఎదుర్కొన్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని కాటన్ల కొద్ది మందు కొనుగోలు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని వైన్సుల వద్ద మందుబాబుల రద్దీతో సందడి వాతావరణం నెలకొంది.
![మందుబాబుల తాకిడితో వైన్సుల ముందు సందడి వాతావరణం heavy rush to wines in yadadri bhuvanagiri districts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11721345-624-11721345-1620733360445.jpg)
heavy rush to wines in yadadri bhuvanagiri districts
మద్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్కరు కాటన్ల కొద్ది మద్యాన్ని కొనుగోలు చేసి... ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మద్యం దుకాణాల వద్ద భారీ క్యూలైన్లతో సందడి వాతావరణం నెలకొంది. ముందు మందు తీసుకోవాలన్న తొందర్లో పడి పలు చోట్ల ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించటం లాంటి నింబంధనలు గాలికొదిలేశారు.