తెలంగాణ

telangana

ETV Bharat / state

Panthangi toll plaza traffic : సంక్రాంతి సందడి.. పంతంగి టోల్‌గేట్‌ వద్ద వాహనాల రద్దీ - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Panthangi toll plaza traffic : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగ దగ్గరపడుతుండడం వల్ల జనం పల్లెబాటపడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు రావడంతో భారీ సంఖ్యలో ఊరెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది.

Panthangi toll plaza traffic , rush in hyderabad bus stops
పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ

By

Published : Jan 12, 2022, 10:03 AM IST

Panthangi toll plaza traffic : సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు కూడా వచ్చేశాయి. ఇంకేం జనం సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు బస్టాపుల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

పల్లెకు పయనం

టీఎస్ఆర్టీసీ నడిపే బస్సులతో సహా, ప్రైవేటు ట్రావెల్స్ సంక్రాంతి స్పెషల్ బస్సులకు ప్రయాణికులు పోటెత్తారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించటంతో పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు జనం క్యూ కట్టారు. గురువారం నుంచి ఈ రద్దీ మరింత పెరగనుంది.

కిటకిటలాడుతున్న ప్రయాణ ప్రాంగణాలు

ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్​ వద్ద వాహనాల రద్దీ నెలకొంది. వాహనాలు పెద్ద మొత్తంలో వస్తున్నా కూడా... దాదాపు 97% ఫాస్టాగ్‌ కలిగిఉన్నాయి. ఫలితంగా నిమిషాల వ్యవధిలోనే టోల్​గేట్ దాటుతున్నాయి.

పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ

గతంతో పోల్చితే టోల్​గేట్ వద్ద గంటల తరబడి వేచి ఉండే సమస్య లేదు. ఫాస్టాగ్‌లో నగదు చెల్లింపుతో టోల్‌ప్లాజాల వద్ద సాఫీగా రాకపోకలు సాగుతున్నాయి. సాధారణ రోజుల్లో కంటే భారీగా వాహనాల రాకపోకలు పెరిగాయి.

పంతంగి టోల్‌గేట్‌ వద్ద వాహనాల రద్దీ

ఇదీ చదవండి:Rush in Railway Stations: సంక్రాంతి కోలాహలం... రద్దీగా మారిన రైల్వేస్టేషన్లు

ABOUT THE AUTHOR

...view details