తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షాలకు కాలువకు గండి... నీట మునిగిన పంట పొలాలు - తెలంగాణ తాజా వార్తలు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు యాదాద్రి భువనగిరి రైతులను నిండా ముంచాయి. మూసీ నుంచి చౌటుప్పల్ మండలానికి నీళ్లు మళ్లించే పిలాయిపల్లి కాల్వకు గండి పడడం వల్ల వందల ఎకరాల్లో వరి, పత్తి పంట నీట మునిగింది.

భారీ వర్షాలకు కాలువకు గండి... నీట మునిగిన పంట పొలాలు
భారీ వర్షాలకు కాలువకు గండి... నీట మునిగిన పంట పొలాలు

By

Published : Sep 15, 2020, 8:57 AM IST

ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటమునగడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యాదాద్రి జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

మూసీ నుంచి చౌటుప్పల్ మండలానికి నీళ్లు మళ్లించే పిలాయిపల్లి కాల్వకు గండి పడడం వల్ల వందల ఎకరాల్లో వరి, పత్తి పంట నీట మునిగింది. అధికారులు పంట నష్టం అంచనా వేసి.. పరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండిఃతాను వాడే మాస్కులపై కేటీఆర్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details