తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుకోకుండా భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం - Yadadri Bhuvanagiri District Latest News

భువనగిరి పట్టణంలో మధ్యాహ్నం గంట సేపు భారీ వర్షం కురిసింది. వర్షానికి ప్రధాన రహదారిపై నీరు నిలిచి గల్లీ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలు సరిగా లేకపోవటంతో మ్యాన్ హోళ్లు పొంగి పొర్లాయి.

Heavy rain lashed Bhuvanagiri town
భువనగిరి పట్టణంలో భారీ వర్షం

By

Published : Feb 19, 2021, 8:54 PM IST

యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గంట సేపు భారీ వర్షం కురిసింది. వానకు ప్రధాన రహదారిపై నీరు నిలిచి గల్లీ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవటంతో మ్యాన్ హోళ్లు పొంగి పొర్లాయి. రోడ్డుపైనే మోకాళ్లలోతు వర్షపు నీరు నిలిచింది. రైతు బజార్, బస్టాండ్, వినాయక్ చౌరస్తాలు జలమయం అయ్యాయి.

ఇదీ చూడండి:ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షం

ABOUT THE AUTHOR

...view details