తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షంతో అన్నదాత ఆగమాగం - Heavy rain in Yadadri district

అకాల వర్షం యాదాద్రి జిల్లాలోని రైతులను నిండా ముంచింది. ఈదురు గాలులకు యాదగిరి గుట్ట తులసీ కాటేజీలో ఉన్న పెద్ద వృక్షం విరిగి పడింది. భక్తులు లేకపోవటం వల్ల ప్రాణనష్టం తప్పింది.

Heavy rain in Yadadri district The farmers most suffered
అకాల వర్షంతో అన్నదాత ఆగమాగం

By

Published : Apr 29, 2020, 10:32 AM IST

యాదాద్రి జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం రైతాంగాన్ని మరోసారి కుదిపేసింది. ఓ పక్క కోతకు వచ్చిన ధాన్యం మడుల్లోనే నేలరాలగా, మరో పక్క కొనుగోలు కేంద్రాల్లో తూకానికి ఉంచిన ధాన్యం తడిసిపోయాయి.

గోరు చుట్టుపై రోకలి పోటులా ఇప్పటికే పలు పర్యాయాలు కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోగా, ఇప్పుడు కురిసిన వర్షం మరింత దెబ్బతీసింది. రాజపేటలో ఈదురుగాలుల కారణంగా మామిడి కాయలు నేలరాలాయి. ఈదురు గాలులకు యాదగిరి గుట్ట తులసీ కాటేజీలో ఉన్న పెద్ద వృక్షం విరిగి పడింది. కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details