యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గ పరిధిలోని భువనగిరి, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి మండల కేంద్రాల్లో ఈరోజు సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత రెండు రోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు వర్షంతో కొంత సేద తీరినా... వర్షానికి భువనగిరి పట్టణంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పట్టణంలోని ప్రధాన రహదారిపై వర్షం నీరు నిలిచి వాహన దారులు ఇబ్బంది పడ్డారు.
భువనగిరి నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో భారీ వర్షం
భువనగిరి నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి భువనగిరి పట్టణంలో రోడ్లన్నీ జలమయం కాగా... వాహనదారులకు అంతరాయం కలిగింది.
భువనగిరి నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో భారీ వర్షం
భువనగిరి బస్టాండ్, జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద భారీగా వర్షం నీరు చేరింది. భారీ వర్షం కురుస్తుండటం వల్ల ముందుజాగ్రత్తగా భువనగిరి పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. వలిగొండ మండలంలో ఉరుములు, మెరుపులు, గాలిదుమారంతో ఓ మోస్తరు వర్షం కురిసింది.
ఇదీ చదవండి: హైదరాబాద్లో చల్లబడ్డ వాతావరణం.. పలు ప్రాంతాల్లో జల్లులు