యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, పోచంపల్లి, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన పడింది. వర్షాలు లేక అల్లాడిపోతున్న రైతన్నలు ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షంతో వాగులు వంకలు వరదతో కళకళలాడుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో ఇంతవరకు ఒక్క భారీ వర్షం పడలేదు. ఈ రోజు కురిసిన వానతో పత్తి, వరి సాగు చేస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎడతెరపిలేని వర్షం... అన్నదాతల హర్షం... - HEAVY RAIN AT YADADRI BHUVANAGIRI
వర్షాలు లేక దిగాలుగా ఉన్న రైతుల మొహాల్లో సంతోషం నింపాడు వరుణుడు. యాదాద్రి జిల్లాలోని పలు మండలాల్లో ఎడతెరపి లేకుండా జోరు వాన కురిసింది.

HEAVY RAIN AT YADADRI BHUVANAGIRI