తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్తికమాసంలో యాదాద్రి ఖజానాకు భారీ ఆదాయం - యాదాద్రి ఆలయం ఆదాయం

కార్తికమాసంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఖజానాకు భారీ ఆదాయం సమకూరింది. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 14 వరకు రూ. 5,74,44,817ల రాబడి వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు.

కార్తికమాసంలో యాదాద్రి ఆలయ ఖజానాకు భారీగా ఆదాయం
కార్తికమాసంలో యాదాద్రి ఆలయ ఖజానాకు భారీగా ఆదాయం

By

Published : Dec 15, 2020, 7:45 AM IST

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. అత్యంత పవిత్రంగా కొలిచే కార్తికమాసంలో వివిధ విభాగాల ద్వారా రూ.5.74 కోట్లు ఖజానాకు చేరింది. గతేడాది కన్నా రూ.24.93 లక్షలు అధిక రాబడి వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. 14,076 మంది దంపతులు సత్యనారాయణ వ్రతాలు జరిపించారు. కార్తికమాసం చివరి ఆదివారం, సోమవారం ఆలయానికి భక్తులు పోటెత్తారు.

నవంబర్ 16 నుంచి డిసెంబర్ 14 వరకు విభాగాల వారీగా ఆదాయం:
ప్రధాన బుకింగ్: రూ. 27,14,346
ప్రత్యేక దర్శనాలు: రూ. 51,63,250
శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు: రూ. 70,38,000
ప్రసాద విక్రయాలు: రూ. 1,51,28,350
కళ్యాణ కట్ట: రూ. 6,55,020

ఇదీ చూడండి:భద్రాద్రిలో ముక్కోటి వేడుకలు... నేటి నుంచే అధ్యయనోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details