యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ (Yadadri Lakshmi Narasimha Swamy Temple) విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం 125 కిలోల బంగారం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తెలిపారు. ప్రతీ గ్రామాన్ని ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. ముఖ్యమంత్రి తొలి విరాళం కిలో 16 తులాల బంగారం ప్రకటించిన కొన్ని గంటల్లోనే తామూ బంగారం ఇచ్చేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. వీరిలో కొందరి పేర్లను ముఖ్యమంత్రి మంగళవారం యాదాద్రి పర్యటన సందర్భంగా స్వయంగా ప్రకటించారు. ఒక్కరోజులోనే సుమారు 22 కిలోల పసిడి విరాళంగా (22kg gold donate) సమకూరింది.
'యాదాద్రికి మా కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం ఇస్తా. తొలి విరాళంగా మా కుటుంబం బంగారం విరాళమిస్తుంది. మంత్రి మల్లారెడ్డి కిలో బంగారం ఇస్తామన్నారు. మేడ్చల్ ప్రజల తరఫున మల్లారెడ్డి మరో కిలో బంగారం ఇస్తామన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి 2 కిలోల బంగారం ఇస్తామన్నారు. కావేరీ సీడ్స్ తరఫున భాస్కర్‌రావు కిలో బంగారం ఇస్తామన్నారు. దామోదర్‌రావు కిలో బంగారం విరాళం ఇస్తామన్నారు. చాలా మంది కిలో బంగారం చొప్పున కానుక ఇస్తామన్నారు. చినజీయర్‌స్వామి పీఠం నుంచి కిలో బంగారం ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కిలో బంగారం ఇస్తామన్నారు. యావత్ ప్రజానీకంలో యాదాద్రి తమదనే భావం రావాలి.'
-- యాదాద్రిలో సీఎం కేసీఆర్