తెలంగాణ

telangana

యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ

By

Published : Mar 8, 2020, 3:09 PM IST

సెలవుదినం కావటం, నిన్నటితో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిపోవటం వల్ల... నేటి నుంచి యాదాద్రి కొండకు భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకున్న అధికారులు లఘు దర్శన సౌకర్యం కల్పించారు.

HEAVY FLOW OF DEVOTEES TO YADADRI
HEAVY FLOW OF DEVOTEES TO YADADRI

యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలవుదినం కావటం వల్ల భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మెుక్కులు చెల్లించుకున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఆలయ అధికరారులు లఘు దర్శనం కల్పించారు.

స్వామివారి ఆలయ పరిసరాల్లో నిత్య కల్యాణం, వ్రత మండపం, పుష్కరిణి పరిసరాలు, ధర్మదర్శనం క్యూలైన్లు , ప్రసాదాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 2 గంటల సమయం, శీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతుంది.

వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్నటితో ముగియటం వల్ల... నేటి నుంచి భక్తుల శాశ్వత, మొక్కు కల్యాణాలు, నిత్య ఉత్సవాలను అర్చకులు పునరుద్ధరించారు. ఆలయ పునర్నిర్మాణం పనుల దృష్ట్యా కొండపైకి వాహనాల అనుమతిని పోలీసులు నిరాకరిస్తున్నారు.

యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ

చూడండి:అసెంబ్లీలో నమస్కారం 'కరో'నా అంటున్న నేతలు

ABOUT THE AUTHOR

...view details