తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల సందడి - యాదాద్రి ఆలయ వార్తలు

చాలా రోజుల తర్వాత యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. బాలాలయ దర్శన క్యూలైన్లు రద్దీగా మారాయి. తిరువీధుల్లో ఘాట్​రోడ్​లో కోలాహలం నెలకొంది. ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఘనంగా ఊంజల్​సేవ మహోత్సవం నిర్వహించారు.

యాదాద్రి పుణ్యక్షేత్రంలో మళ్లీ నెలకొన్న భక్తుల సందడి
యాదాద్రి పుణ్యక్షేత్రంలో మళ్లీ నెలకొన్న భక్తుల సందడి

By

Published : Oct 30, 2020, 10:26 PM IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. శుక్రవారం రోజున యాదాద్రి క్షేత్రాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. బాలాలయ దర్శన క్యూలైన్లు రద్దీగా మారాయి. తిరువీధుల్లో ఘాట్​రోడ్​లో కోలాహలం నెలకొంది. హరిహరులను దర్శించుకున్న భక్తులు సేవోత్సవంలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.

యాదాద్రి పుణ్యక్షేత్రంలో మళ్లీ నెలకొన్న భక్తుల సందడి

స్వామివారికి నిత్యఉత్సవాలు సంప్రదాయ రీతిలో కొనసాగాయి. కవచమూర్తులకు అభిషేకం, అర్చనలు జరిపిన అర్చకులు హోమం, నిత్యకల్యాణోత్సవం వేడుకలు నిర్వహించారు. అనుబంధ ఆలయం పాతగుట్ట ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

యాదాద్రి పుణ్యక్షేత్రంలో మళ్లీ నెలకొన్న భక్తుల సందడి

ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఘనంగా ఊంజల్​సేవ మహోత్సవం నిర్వహించారు. ఉంజల్ సేవా మహోత్సవంలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో, తులసీదళాలు, వివిధ రకాల పూలతో ప్రత్యేక పూజలు జరిపారు.

ఇదీ చూడండి: సిద్ధమైన రైతువేదికలు... రేపు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం

ABOUT THE AUTHOR

...view details