అనుమానం పెనుభూతమై భర్త, అత్తింటి వారు వేధింపులకు గురిచేస్తే.. భరించలేక యాదగిరిగుట్ట మండలంలోని చొల్లేరు గ్రామానికి చెందిన పూజశ్రీ (25) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొన ఊపిరితో భర్త ఇంటివద్ద ఆందోళన చేపట్టి... మంగళవారం సాయంత్రం కన్నుమూసింది. మృతురాలు పూజశ్రీతోపాటు ఆమె రెండు నెలల మగబిడ్డకు న్యాయం చేయాలని పూజశ్రీ తల్లిదండ్రులు, బంధువులు పోలీసులను ఆశ్రయించారు. అక్కడ కనిపించిన ఈ దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది.
కన్నా.. అమ్మ లేదని రాదని చెప్పనా! - తెలంగాణ వార్తలు
పాపం.. ఆ చంటిబిడ్డకేమి తెలుసు..తల్లి తిరిగిరాని లోకానికి వెళ్లిందని. ఆ తల్లికేమి తెలుసు.. చంటిబిడ్డను వదిలి.. తన కూతురు అర్ధంతరంగా తనువు చాలిస్తుందని..తల్లి ఒడిలో సేదతీరాల్సిన చిన్నారి.. అమ్మమ్మ ఒడిలో వాలిపోయిండు. అమ్మ వస్తుందేమో.. ఆకలి తీర్చుతుందేమోనని ఆశతో దిక్కులు చూస్తున్నాడు. గుక్కపట్టి ఏడుస్తున్న మనవడిదీనస్థితి చూడలేక..ఏమిచేయాలో పాలుపోక.. పాలపీక పెట్టి జోకొడుతోంది ఓ అమ్మమ్మ.
కన్నా.. అమ్మ లేదని రాదని చెప్పనా!