తెలంగాణ

telangana

ETV Bharat / state

బాధితులకు సరైన వైద్యం అందించండి: హెల్త్ సెక్రటరీ - etv bharat latest news

అత్యధిక పాజిటివ్​ కేసులు నమోదవుతున్న మండలాలను రెండో విడత డోర్​ టూ డోర్​ సర్వే ద్వారా గుర్తించి.. బాధితులకు సరైన చికిత్స అందించాలని రాష్ట్ర హెల్త్​ సెక్రటరీ సయ్యద్​ ముర్తుజా రిజ్వీ సూచించారు. బీబీనగర్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్​తోపాటు​ పాల్గొన్నారు.

health secretary
health secretary

By

Published : May 22, 2021, 8:18 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో పీహెచ్​సీ డాక్టర్లు, మున్సిపల్​ కమిషనర్లు, మండల కో ఆర్డినేటింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో హెల్త్​ సెక్రటరీ సయ్యద్ ముర్తుజా పాల్గొన్నారు.

డోర్​ టూ డోర్​ సర్వే ద్వారా గుర్తించిన బాధితులకు మెడికల్ కిట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆశాలు, ఏఎన్​ఎంలు, డాక్టర్ల టీమ్​ ద్వారా మండల అధికారులు నిరంతరాయంగా పర్యవేక్షించాలని తెలిపారు.

రెండోసారి జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చౌటుప్పల్ మండలం తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 13వేల ఇళ్లకు నిర్వహించిన సర్వేలో 534 మందికి కరోనా లక్షణాలు గుర్తించారు. అందులో 46 మందికి పాజిటివ్ రావడంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని హెల్త్ సెక్రటరీ ఆదేశించారు.

ఇదీ చదవండి:'మొల్నుపిరావిర్ విజయవంతమైతే కరోనా కట్టడిలో అత్యుత్తమ ఫలితాలు'

ABOUT THE AUTHOR

...view details