యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చౌదరిపల్లికి చెందిన మైలారం పద్మకు కాళ్ల వాపులు రావడం వల్ల చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తీసుకువచ్చారు. సుమారు 6 గంటలకు ఆసుపత్రిలో చేర్చారు. రెండు గంటలైనా చికిత్స అందించకపోవడం వల్ల పద్మ మృతి చెందిందని భర్త జంగయ్య ఆరోపించారు. ఆసుపత్రికి వచ్చిన తర్వాత కూడా మంచిగా మాట్లాడిన పద్మ.. వైద్యులు సకాలంలో చికిత్స అందించకపోవడం వల్లే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో బంధువుల రొదనలు మిన్నంటాయి.
వైద్యుల నిర్లక్ష్యం... పోయిన ప్రాణం..! - భువనగిరిలో ఓ వివాహిత వైద్యం అందక మృతి
సకాలంలో వైద్యం అందక 38 సంవత్సరాల వివాహిత మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
![వైద్యుల నిర్లక్ష్యం... పోయిన ప్రాణం..! Healing is the death of a married woman in bhongir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7232286-thumbnail-3x2-kee.jpg)
వైద్యుల నిర్లక్ష్యం... పోయిన ఓ ప్రాణం..!
TAGGED:
women death at bhongir