తెలంగాణ

telangana

ETV Bharat / state

వాడికి మరణశిక్షే సరి... హాజీపూర్ గ్రామస్థుల సంబురాలు - హాజీపూర్ గ్రామస్థుల సంబురాలు

బొమ్మలరామారంలో ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధిండంపై హాజీపూర్ గ్రామస్థులు సంబురాలు చేసుకుంటున్నారు.

hazipur villagers in Celebrations; due to Hajipur convict sentenced to death
వాడికి మరణశిక్షే సరి... హాజీపూర్ గ్రామస్థుల సంబురాలు

By

Published : Feb 7, 2020, 12:55 PM IST

శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష విధించిన నేపథ్యంలో హాజీపూర్ గ్రామంలో పండగ వాతావరణం మొదలైంది. బాణసంచా కాల్చి గ్రామస్థులు మిఠాయిలు పంచుకున్నారు. ఊర్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. బాలికలను దారుణంగా హతమార్చిన శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్షే సబబు అంటున్నారు.

వాడికి మరణశిక్షే సరి... హాజీపూర్ గ్రామస్థుల సంబురాలు

బాలికల ఆత్మలకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. త్వరలోనే నిందితుడిని ఉరి తీయాలని కోరుతున్నారు. నిందితుడు మరో కోర్టుకు అప్పీల్ చేసుకోకుండా న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి కోరారు.

ఇవీ చూడండి:శ్రీనివాస్‌ రెడ్డికి మరణదండన విధించిన కోర్టు

ABOUT THE AUTHOR

...view details