యాదాద్రి జిల్లా హాజీపూర్ హత్యల కేసుల్లో మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష పడటం పట్ల హాజీపూర్ గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 10 నెలల నుంచి కోర్టుపైన నమ్మకంతో ఎదురు చూశామని వారు తెలిపారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే టపాసులు కాల్పి స్వీట్లు పంచుకున్నారు.
ఉరిశిక్ష తీర్పుతో సంబురాల్లో హాజీపూర్ గ్రామస్థులు - హాజీపూర్
హాజీపూర్ హత్యల కేసుల్లో శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
గత 10 నెలల నుంచి కోర్టుపై నమ్మకం ఉంది: హాజీపూర్ గ్రామస్థులు
వీలైనంత త్వరగా ఉరిశిక్ష వేస్తే గ్రామం ఇంకా ప్రశాంతంగా ఉంటుదన్నారు. నరహంతకుని చేతిలో హత్యకు గురైన ముగ్గురికి సంతాపం ప్రకటిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఇవీ చూడండి:శ్రీనివాస్ రెడ్డికి మరణదండన విధించిన కోర్టు
Last Updated : Feb 6, 2020, 11:43 PM IST