యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ శివారులో జరిగిన బాలికల దారుణ హత్యల కేసుల్లో... తుది తీర్పు ఫిబ్రవరి 6కి వాయిదా పడింది. ముగ్గురు విద్యార్థినిలను అత్యంత పాశవికంగా హత్యాచారం చేసిన ఘటనల్లో... నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. నల్గొండ పోక్సో న్యాయస్థానంలో విచారణ సాగింది. 101 మంది సాక్షుల వాంగ్మూలాలతోపాటు డీఎన్ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. గత డిసెంబర్ 28తోపాటు ఈ నెల 6, 7, 8 తేదీల్లో... తుది వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ తరఫున వాదనలు విన్న కోర్టు... తుది తీర్పు ఫిబ్రవరి 6కి వాయిదా వేసింది.
హాజీపూర్ హత్యల కేసులో తుది తీర్పు ఫిబ్రవరి 6కి వాయిదా - హాజీపూర్ హత్యల కేసులో తుది తీర్పు ఫిబ్రవరి 6కి వాయిదా
హాజీపూర్ హత్యల కేసులో తుది తీర్పు ఫిబ్రవరి 6కి వాయిదా
11:21 January 27
హాజీపూర్ హత్యల కేసులో తుది తీర్పు ఫిబ్రవరి 6కి వాయిదా
Last Updated : Jan 27, 2020, 11:53 AM IST
TAGGED:
హాజీపూర్ న్యూస్