తెలంగాణ

telangana

ETV Bharat / state

హాజీపూర్ కేసులో మరికొద్దిసేపట్లో 'తుది' వాదనలు - హాజీపూర్ కేసులో నేటినుంచి 'తుది' వాదనలు

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ బాలికల హత్యల కేసుల్లో... ఈ రోజు నుంచి తుది వాదనలు జరగనున్నాయి. మధ్యాహ్నం తర్వాత నల్గొండలోని పోక్సో చట్టం న్యాయస్థానంలో కేసు వాదనలు ప్రారంభమవుతాయి.

hazipur case
హాజీపూర్ కేసులో నేటినుంచి 'తుది' వాదనలు

By

Published : Jan 6, 2020, 10:20 AM IST

Updated : Jan 6, 2020, 12:05 PM IST

హాజీపూర్ కేసులో మరికొద్దిసేపట్లో 'తుది' వాదనలు

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ బాలికల వరుస హత్యల కేసుల్లో... నేటి నుంచి తుది వాదనలు ప్రారంభమవుతున్నాయి. సాక్షుల వాంగ్మూలాల ప్రక్రియ పూర్తయినందున... ఇక తుది వాదనలకు సిద్ధం కావాలని ఈ నెల 3న న్యాయస్థానం ఆదేశించింది. నల్గొండలోని మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థాన పోక్సో చట్టం కోర్టులో... ఇరుపక్షాల న్యాయవాదులు ఈ రోజు మధ్యాహ్నం తమ వాదనలు వినిపించనున్నారు.

ముగ్గురు బాలికల హత్య కేసుల్లో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని... గతేడాది ఏప్రిల్ 27న పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు విద్యార్థినుల దారుణ హత్యోదంతాల్లో... మొత్తం 101 మంది సాక్షుల వాంగ్మూలాల్ని పోలీసులు తీసుకున్నారు.

నిందితుడికిన వాంగ్మూలాలన్నింటినీ వినిపించి... ఒక్కో దానిపై అతడిచ్చిన అభిప్రాయాన్ని నమోదు చేశారు. శ్రీనివాస్ రెడ్డి తరఫున సాక్షులను ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించగా... తన తల్లిదండ్రుల్ని తీసుకురావాలని నిందితుడు కోరాడు. కానీ వారి చిరునామా తెలియకపోవడం వల్ల తుది వాదనలకు న్యాయస్థానం ఆదేశించింది.

ఇవీ చూడండి: శ్రీవారి సన్నిధిలో 'మన' మంత్రులు...

Last Updated : Jan 6, 2020, 12:05 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details