బిర్యానీ తినడానికి ఓ హోటల్‌కి వెళ్లిన కుటుంబ సభ్యులకు చికెన్ ముక్కలతో పాటు జెర్రి వచ్చింది. ఈ ఘటన భువనగిరిలోని ఓ హోటల్ చోటు చేసుకుంది. రామన్నపేటకు చెందిన చంద్రశేఖర్ బిర్యానీ తినేందుకు కుటుంబసభ్యులతో కలిసి పట్టణ శివారులోని డాల్ఫిన్ హోటల్‌కి వెళ్లాడు. చికెన్ బిర్యానీ ఆర్డరిచ్చారు. బిర్యానీ తీసుకొచ్చి ప్లేట్లో వడ్డించి తినాలని చూసేసరికి జెర్రి దర్శనమిచ్చింది. యాజమాన్యంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. హోటల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు బాధితులకు హామీ ఇచ్చారు.
బిర్యానీలో చికెన్ ముక్కలతో పాటు దర్శనమిచ్చిన "జెర్రి" - డాల్పిన్ హోటల్ బిర్యానీలో జెర్రీ
కుటుంబసభ్యులంతా కలిసి బిర్యానీ తినేందుకు ఓ హోటల్‌కు వెళ్లారు. ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ తినేందుకు ఉవ్వీళ్లూరుతున్న వారికి... ప్లేట్లో వడ్డించిన బిర్యానీ చూసేసరికి ఒకారం వచ్చింది. ఎందుకనుకుంటున్నారా... ప్లేట్లో చికెన్ ముక్కలతో పాటు... జెర్రి కూడా దర్శనమిచ్చింది వాళ్లకు...!
HARMFUL INSECT APPEARED IN CHICKEN BIRYANI AT BHUVANAGIRI RESTAURANT