తెలంగాణ

telangana

ETV Bharat / state

మునుగోడు ఉపఎన్నికకు భాజపా మేనిఫెస్టో హాస్యాస్పదం: హరీశ్‌రావు

Harishrao Fires on BJP: కేంద్రం ప్రభుత్వంపై మంత్రి హరీశ్​రావు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మిషన్ కాకతీయను కాపీ కొట్టి కేంద్రం అమృత్ సరోవర్ అని పెట్టుకున్నారని విమర్శించారు. ఘర్ కో జల్ పథకానికి మిషన్ భగీరథ ఆదర్శమని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని హరీశ్​రావు ప్రశ్నించారు.

Harishrao fires on BJP
Harishrao fires on BJP

By

Published : Oct 26, 2022, 8:42 PM IST

Updated : Oct 26, 2022, 10:58 PM IST

Harishrao Fires on BJP: మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా భాజపా విడుదల చేసిన మేనిఫెస్టోపై మంత్రి హరీశ్​రావు తనదైన శైలిలో స్పందించారు. భాజపా మేనిఫెస్టో హాస్యాస్పదమని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారని దుయ్యబట్టారు. దుబ్బాక, హుజురాబాద్‌లో ఇలా మాయమాటలతోనే మోసం చేశారని ఆరోపించారు. 4 టెక్స్‌టైల్ పార్క్‌ల కేటాయింపులో తెలంగాణకు మొండిచేయి చూపారని విమర్శించారు.

ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం 2016లో ప్రకటిస్తే ఇప్పటికీ అతి గతిలేదని మంత్రి హరీశ్​రావు దుయ్యబట్టారు. కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు అడిగితే ఇవ్వలేదని ఆక్షేపించారు. మిషన్ కాకతీయను కాపీ కొట్టి అమృత్ సరోవర్ అని పెట్టుకున్నారని ఆరోపించారు. హార్ ఘర్ కో జల్ పథకానికి మిషన్ భగీరథ ఆదర్శమని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్ ధర వింటేనే ప్రజల కళ్లల్లో నీళ్లు వస్తున్నాయని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డికి మునుగోడు కంటే.. కాంట్రాక్టుల మీద ప్రేమ ఎక్కువ అని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

మునుగోడు ఉపఎన్నికకు భాజపా మేనిఫెస్టో హాస్యాస్పదం: హరీశ్‌రావు

"మొత్తం ఇప్పుడు లెక్క తీస్తే కేంద్రం రాష్ట్రానికి రూ.33,545 కోట్లు బాకీ ఉంది. కొత్తగా ఏమీ ఇవ్వొద్దు. మాకు రూ.33,545 కోట్లు ఇస్తే చాలు. ఇవన్నీ పక్కన పెట్టి మేనిఫెస్టోలు అంటూ మీరు చేస్తున్న ప్రకటనలను మునుగోడు ప్రజలు నమ్మరు." - హరీశ్​రావు మంత్రి

Last Updated : Oct 26, 2022, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details