ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు భక్తులు లేకుండానే జరిగాయి. పాతగుట్ట సమీపంలోని గుండం వద్ద ఉన్న శ్రీఆంజనేయ స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతమన్యుసూక్త పారాయణము, అభిషేకం, లక్ష తమలపాకులతో అర్చన మహానివేదన పూజలు జరిపించారు.
Yadadri: భక్తులు లేకుండానే హనుమాన్ జయంతి వేడుకలు - corona lockdown restriction affected on hanuman jayanthi celebrations
రాష్ట్రంలో కరోనా విజృంభణ, లాక్డౌన్ వల్ల హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. యాదాద్రిలో కొంతమంది సమక్షంలోనే ప్రత్యేక పూజలు చేశారు.

భక్తులు ఎవరూ లేకుండానే హనుమాన్ జయంతి వేడుకలు
ప్రస్తుతం కరోనా వ్యాప్తి, లాక్డౌన్ ఉన్నందు వల్ల జయంతి వేడుకలు అతికొద్ది మంది సమక్షంలోనే నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెరాస, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా