చేనేత పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాశికంటి లక్షీ నర్సయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో... చేనేత పరిశ్రమ రక్షణకై రిలే నిరహార దీక్షలు చేపట్టారు. చేనేత వస్త్ర నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరారు.
'నెలకు రూ. 7,500 భృతి ఇచ్చి చేనేత కార్మికులను ఆదుకోవాలి' - చేనేత పరిశ్రమ రక్షణకై రిలే చేనేత కార్మికుల నిరహార దీక్షలు
కరోనా విపత్కర పరిస్థితిలో... నెలకు రూ. 7,500 భృతి ఇచ్చి గుర్తింపు పొందిన కార్మికులను ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాశికంటి లక్షీ నర్సయ్య డిమాండ్ చేశారు. మోత్కూరు మున్సిపాలిటీలో చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో... చేనేత పరిశ్రమ రక్షణకై రిలే నిరహార దీక్షలు చేపట్టారు.
'నెలకు రూ. 7,500 భృతి ఇచ్చి చేనేత కార్మికులను ఆదుకోవాలి'
కరోనా విపత్కర పరిస్థితిలో... నెలకు రూ. 7,500 భృతి ఇచ్చి కార్మికులను ఆదుకోవాలన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకన్నకార్మికులకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. దీక్షకు మోత్కూరు మండల సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి:సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు