యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన వస్త్ర నిల్వల్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని.. అంతేకాకుండా నూలు, రంగు, రసాయనాలపై ఉన్న జీఎస్టీని తొలగించాలని చేనేత కార్మికులు డిమాండ్ చేశారు. శాశ్వత ప్రాతిపదికన చేనేత కార్మికులకు మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.
వస్త్ర నిల్వల్ని ప్రభుత్వమే కొనాలంటూ నిరాహార దీక్ష - handloom workers protest to slove their problems at atmakur
కరోనా ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన వస్త్ర నిల్వల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
వస్త్ర నిల్వల్ని ప్రభుత్వమే కొనాలంటూ నిరాహార దీక్ష
కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తమకు ప్రతి నెల రూ.8000 భత్యం ఇవ్వాలని కోరారు. ప్రతి మగ్గానికి సరిపడా నూలును సర్కారు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. రైతు బంధు తరహాలో చేనేత బంధు పథకం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.
ఇదీ చదవండి :డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట 40 మందికి టోకరా