యాదగిరిగుట్ట పట్టణ సమీపంలోని దాతారుపల్లి గ్రామపరిధిలోని అర ఎకరం భూమిని సుక్కల సత్యం యాదవ్- సువర్ణ దంపతులు విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కుమార్తె జ్ఞాపకార్థం జనగామ జిల్లా కేంద్రంలోని వర్ధన్ అనాథాశ్రమానికి విరాళంగా అందజేశారు. సంబంధిత భూమి పట్టా పుస్తకం, రిజిస్ట్రేషన్ పత్రాలను ఆశ్రమ స్థాపకులు కత్తుల రవీందర్- లక్ష్మీ దంపతులకు అందజేశారు.
కుమార్తె జ్ఞాపకార్థం అనాథాశ్రమానికి అర ఎకరం భూమి - అనాథాశ్రమానికి అర ఎకరం భూమి
సుక్కల సత్యం యాదవ్ దంపతులు తమ కుమార్తె జ్ఞాపకార్థం అనాథాశ్రమానికి అర ఎకరం భూమిని విరాళమిచ్చి మానవత్వం చాటుకున్నారు. సుమారు 50 లక్షల విలువ గల భూమిని జనగామ జిల్లా కేంద్రంలోని వర్ధన్ అనాథాశ్రమానికి విరాళంగా అందజేశారు.
సుక్కల సత్యం యాదవ్- సువర్ణ దంపతుల కుమార్తె స్నేహ… గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. స్నేహది మానవతా హృదయం. అందువల్ల ఆమె జ్ఞాపకార్థం అనాథాశ్రమానికి భూదానం చేశారు. తమ కుమారై జ్ఞాపకార్థం త్వరలోనే మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని సుక్కల సత్యం యాదవ్ - సువర్ణ దంపతులు తెలిపారు. ఆశ్రమ భవన నిర్మాణం, నిర్వహణకు మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుక్కల పృథ్వి- స్వాతి, సుక్కల నందు యాదవ్, ఐడ్రీమ్ సీఈఓ వాసుదేవారెడ్డి, జర్నలిస్ట్ మురళీధర్, బి.నర్సింహారెడ్డి, మేడి శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఐదు మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటిన తెరాస