హాజీపూర్ బావిలో మరికొన్ని అస్థికలు లభ్యం - HAJIPUR SERIAL MURDERS
యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన కల్పనను కూడా శ్రీనివాస్‌రెడ్డి హత్యచేసి ఉంటాడని అనుమానించిన పోలీసులు బావిలో తవ్వకాలు మొదలుపెట్టారు. అనుకున్నట్టుగానే అదే బావిలో అస్థికలు బయటపడ్డాయి. ఇవి కల్పనవే అని పోలీసులు అనుమానిస్తున్నారు.
మొన్న శ్రావణి, నిన్న మనీషా, నేడు కల్పన... వరుస హత్య ఘటనలు యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. శ్రావణి, మనీషాను పూడ్చిపెట్టిన బావిలోనే తాజాగా మరికొన్ని అస్థికలు లభ్యమయ్యాయి. ఇవాళ బావిలో తవ్వకాలు జరిపిన పోలీసులు అస్థికలను వెలికితీశారు. అవి నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పన అనే బాలికవేనని పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డే కల్పనను హత్యచేసి బావిలో పూడ్చిపెట్టి ఉంటాడని వారు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.
TAGGED:
HAJIPUR SERIAL MURDERS