తెలంగాణ

telangana

ETV Bharat / state

చౌటుప్పల్​లో వడగళ్ల వర్షం - Hail rain in Chautuppal Yadadri district

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో వడగళ్లతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలుల ధాటికి పట్టణంలోని ఇళ్లపై కప్పులు ఎగిరిపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Hail rain in Chautuppal Yadadri district
చౌటుప్పల్​లో వడగళ్ల వర్షం

By

Published : Mar 19, 2020, 7:53 PM IST

ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో చాలాచోట్ల వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది.

జాతీయ రహదారిపై వడగళ్లతో కూడిన వర్షం పడటం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాసేపు ట్రాఫిక్​ అంతరాయం ఏర్పడింది.

చౌటుప్పల్​లో వడగళ్ల వర్షం

ఇదీ చూడండి:నిర్భయ దోషులకు ఉరి తప్పదు... సుప్రీం కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details