యాదగిరిగుట్టలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు - yadhagirigutta news in telugu
గురుపౌర్ణమిని పురస్కరించుకుని యాదగిరిగుట్టలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాథునికి ప్రత్యేక అభిషేకాలతో పాటు కాగడ హారతి, విశేష పూజలు చేశారు.

guru pournami special worships in yadhagirigutta
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సాయినాథునికి కాగడ హారతి, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకువ జామునుంచే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ సాయిబాబాను దర్శించుకున్నారు. ప్రత్యేక అలంకారణలో సాయిబాబా భక్తులకు దర్శనమిచ్చారు.