కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే యాదాద్రి భువనగిరి జిల్లాలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. అత్యవసర సేవలు, పాల ట్యాంకర్లు, అంబులెన్స్, ఆస్పత్రికి వెళ్లే వాహనాలు మినహా మిగిలిన వాటిని అనుమతించడం లేదు. రేపు ఉదయం 6 గంటల వరకు టోల్ ప్లాజా వద్ద రాకపోకలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.
గూడూరు టోల్‌ప్లాజా వద్ద రాకపోకలు బంద్ - గూడూరు టోల్‌ప్లాజా వద్ద జనతా కర్ఫ్యూ
యాదాద్రి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద వాహన రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. అత్యవసర సేవలు, అంబులెన్స్ వాహనాలు తప్ప మిగిలిన వాటిని అనుమతించడం లేదు.
గూడూరు టోల్‌ప్లాజా వద్ద రాకపోకలు బంద్