యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న యాదగిరిగుట్ట పుర ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు... పురపాలక కార్యాలయ ఆవరణలో పంపిణీ చేపట్టారు. 52 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను అందజేశారు.
యాదగిరిగుట్టలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - grocery distribution to sanitaton workers
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని పారిశుద్ధ్య కార్మికులకు ఆరు నెలలకు సరిపడ నిత్యావసరాలను అందజేశారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట పురపాలిక ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
యాదగిరిగుట్టలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
వారికి విధుల్లో కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య కార్మికులకు ఆరు నెలలకు సరిపడ, సబ్బులు, కొబ్బరి నూనెలు, దుస్తులు, చెప్పులు, తదితరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఛైర్మన్ ఎరుకల సుధా-హేమేందర్, వైస్ ఛైర్మన్ కాటంరాజు, పురపాలక కమిషనర్ రజిత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:20 రోజుల్లో వ్యవసాయేతర ఆస్తులకు రిజిస్ట్రేషన్: కేసీఆర్