కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులకు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో నిత్యావసరాలను అందించారు. జిల్లా వైద్యాధికారి సాయంతో ఎన్ఆర్ఐ ఫోరం ద్వారా బోధన, బోధనేతర సిబ్బందికి సరుకులను పంపిణీ చేశారు. కరోనా కాలంలో వలస కార్మికులకు, ఆరోగ్య కార్యకర్తలకు నల్గొండ.ఓఆర్జీ సంస్థ ద్వారా సహాయం అందించామని జిల్లా సమన్వయకర్త రమేష్ తెలిపారు.
ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసరాల పంపిణీ - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
కరోనాతో ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థతి అగమ్యగోచరంగా మారింది. జీతాల్లేక దయనీయ పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఉపాధి కోల్పోయిన వారికి జిల్లా వైద్యాధికారి సాయంతో ఎన్ఆర్ఐ ఫోరం ద్వారా బోధన, బోధనేతర సిబ్బందికి సరుకులను పంపిణీ చేశారు. అత్మస్థైర్యం కోల్పోవద్దని వారిలో స్ఫూర్తి నింపారు.

ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసరాల పంపిణీ
ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆత్మన్యూనతాభావానికి లోనుకావొద్దని వారిలో ధైర్యం నింపారు. అత్మస్థైర్యం కోల్పోకుండా జీవించాలన్నారు. నిత్యావసరాలు అందజేయడం పట్ల ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విజయరావు, ప్రైవేట్ పాఠశాలల కార్యదర్శులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.