యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో హోం క్వారంటైన్లో ఉన్న కుటుంబాలకు సీపీఎం నేతలు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. కాలనీలో ఓ వ్యక్తికి పాజిటివ్ రాగా అతన్ని ఆసుపత్రిలో చేర్చింపి అధికారులు చికిత్స అందిస్తున్నారు. కాగా అతని ప్రైమరీ కాంటాక్ట్స్ అయిన ఏడు కుటుంబాలుకు హోంక్వారంటైన్ విధించారు.
హోం క్వారంటైన్ బాధితులకు సీపీఎం నిత్యవసరాల పంపిణీ - యాదాద్రి భువనగిరి జిల్లాతాజా వార్త
యాదాద్రి భువనగిరిజిల్లా ఆలేరులోని ఓ కాలనీలో హోం క్వారంటైన్లో ఉన్న కుటుంబాలకు సీపీఎం నేతలు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా తమను సంప్రదించండంటూ సూచించారు.
![హోం క్వారంటైన్ బాధితులకు సీపీఎం నిత్యవసరాల పంపిణీ groceries distribution to the home quarantine people at aleru by cpm leaders in yadadri bhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8076714-699-8076714-1595074784358.jpg)
హోం క్వారంటైన్లో ఉన్న వారికి సీపీఎం నేతలు నిత్యవసరాలు పంపిణీ
ఇదంతా బాగానే ఉండగా మొదటి రెండు రోజులు అధికారులు ఆ ప్రాంతంలో శానిటైజేషన్ చేసి వారి బాగోగులు చూసుకోకుండా నిర్లక్ష్యంగా అలా వదిలేసివెళ్లిపోయారని ఇవ్వాళకి పదిరోజులు కావస్తున్నా వారిని పట్టించుకోలేదని సీపీఎం నేతలు విమర్శించారు. వారి స్థితి చూసి వారికి కావాల్సిన నిత్యావసరాలను తాము పంపిణీ చేశామని సీపీఎం జిల్లా కార్యదర్శి మంగ నరసింహులు తెలిపారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు