తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి చిరుద్యోగులకు సరకుల పంపిణీ - నిత్యావసరాల పంపిణీ

లాక్​డౌన్​ సమయంలో సైతం విధులు నిర్వహిస్తున్న యాదాద్రి దేవస్థానం చిరుద్యోగులకు, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులకు నిత్యావసర సరకులు పంచారు. హైదరాబాద్​కు చెందిన అక్షయపాత్ర ఫౌండేషన్​ వారి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు సరుకులు పంపిణీ చేశారు.

Groceries Distribution In Yadadri Temple
యాదాద్రి చిరుద్యోగులకు సరుకుల పంపిణీ

By

Published : Jun 15, 2020, 11:03 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి దేవస్థానంలో పనిచేసే చిరుద్యోగులకు అక్షయపాత్ర ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ మొదలైనపప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్షమందికి పైగా నిత్యావసర సరుకులు అందించినట్టు ఫౌండేషన్​ సభ్యులు పేర్కొన్నారు. లాక్​డౌన్​ సమయంలో ఇబ్బందులు పడుతున్న చిరుద్యోగులకు తమవంతు సాయంగా నిత్యావసరాలు అందిస్తున్నట్టు ఫౌండేషన్​ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్​ ఛైర్మన్​ కిషన్​ రావు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details