యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరులోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిషాకు చెందిన వలస కూలీలకు భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. నల్గొండ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ సహకారంతో 900 మంది కార్మికులకు గోధుమ పిండి, వంట నూనె, పప్పులు, ఉప్పు, కారం, పసుపు, సబ్బులు అందజేశారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
వలస కార్మికులకు నిత్యావసర సరకుల పంపిణీ - నల్గొండ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ నిత్యావసరాల పంపిణీ
ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిషాకు చెందిన కూలీలకు నల్గొండ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి పాల్గొని 900 మంది కార్మికులకు అందజేశారు.

వలస కార్మికులకు నిత్యావసర సరకుల పంపిణీ