హరిత సవాలులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా పాలనాధికారి అనితా రామచంద్రన్.. కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. కామారెడ్డి, జనగామ కలెక్టర్లు విసిరిన హరిత సవాలును ఆమె పూర్తి చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో మొక్కల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
హరిత సవాలును పూర్తి చేసిన జిల్లా పాలనాధికారి - యాదాద్రి భువనగిరి జిల్లా హరితహారం
పార్లమెంట్ సభ్యులు సంతోష్‌కుమార్ చేపట్టిన హరిత సవాలులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా పాలనాధికారి అనితా రామచంద్రన్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు.
హరిత సవాలును పూర్తి చేసిన జిల్లా పాలనాధికారి
జిల్లాలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, బీబీనగర్ నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ దుబై, ముఖ్యమంత్రి కార్యాలయ హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌కు కలెక్టర్ హరిత సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో అదనపు పాలనాధికారి శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా అటవీ, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.