తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ భారత్​ కథనానికి స్పందన

అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలైన తల్లిని ఆస్పత్రిలో చూపిస్తానని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బస్ స్టాండ్ సమీపంలో వదిలేసిన ఘటనకు సంబంధించి ఈనాడు-ఈటీవీ భారత్​ కథనానికి స్పందన వచ్చింది. వృద్ధురాలి మనవళ్లు సోమవారం సాయంత్రం పోలీస్​ స్టేషన్​కు వచ్చి ఆమెను తీసుకెళ్లారు.

grand sons taken grand mother in yadadri bhuvagiri district
ఈనాడు-ఈటీవీ భారత్​ కథనానికి స్పందన

By

Published : Jul 7, 2020, 3:51 AM IST

నడవలేని స్థితిలో ఉన్న తల్లిని ఆస్పత్రిలో చూపిస్తానని చెప్పి ఒంటరిగా వదిలేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆ వృద్ధురాలికి చికిత్స అందించారు. ఇదే విషయమై ఈనాడు-ఈటీవీ భారత్​లో కథనం ప్రచురింతమైంది. కథనానికి స్పందించిన ఆమె మనవళ్లు వృద్ధురాలిని తీసుకెళ్లేందుకు సోమవారం సాయంత్రం భువనగిరి పోలీస్ స్టేషన్​కి వచ్చారు.

పోలీసులు, జిల్లా మహిళ శిశు, వయోవృద్ధుల శాఖ ఉద్యోగులు, అమ్మ ఒడి ఆశ్రమ నిర్వాహకులు వృద్ధురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆమెను వారి మనువళ్లకు అప్పగించారు. ఆమెను బాగానే చూసుకున్నామని మనుమడు నగేశ్​ చెప్పాడు. వృద్ధరాలు చెప్పినట్లు 40 వేల రూపాయలు తాము తీసుకోలేదన్నారు.

ఈనాడు-ఈటీవీ భారత్​ కథనానికి స్పందన

ఇదీ చూడండి:వీధిలో విడిచిపెట్టిన కొడుకు... దీనంగా ఎదురుచూస్తున్న తల్లి

ABOUT THE AUTHOR

...view details