తెలంగాణ

telangana

By

Published : May 21, 2021, 9:17 AM IST

ETV Bharat / state

అకాల వర్షాలతో మొలకెత్తిన ధాన్యం

ఆరుగాలం పండించిన ధాన్యం వర్షార్పణం అయింది. పంట పండించడం కన్నా అమ్ముకోవడానికే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Grain soaked with un seasonal  rains, grain loss due to rains
అకాల వర్షాలతో పంట నీటిపాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు

అకాల వర్షాలతో చేతిదాకా వచ్చిన పంట నీటిపాలైంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో కురిసిన వర్షానికి ఐకేపీ, పీఎసీఎస్ కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దైంది. దత్తాయిపల్లి గ్రామంలో రైతులు అధికారులకు, కలెక్టర్​కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని వాపోయారు.

మొలకెత్తిన ధాన్యం

ధాన్యం పండించడం ఒక కష్టమైతే... అమ్ముకోవడం గగనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోస్తే... వర్షానికి పూర్తిగా తడిసి మొలకెత్తిందని వాపోయారు.

ఇదీ చదవండి:ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details