రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వెల్మజాల, సీతారాంపురం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ వానాకాలంలో రైతులు పండించిన మొత్తం పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని... దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
'ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం' - yadadri bhuvanagiri district latest news
అన్నదాతలు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోకుండా... నాణ్యమైన పంటకు మంచి ధరను పొందాలని ఆకాంక్షించారు.
రైతులు తాము పండించిన నాణ్యమైన పంటకు మంచి ధరను పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి, జడ్పీటీసీ కోలుకొండ లక్ష్మీ, జిల్లా కోఆఫ్షన్ సభ్యుడు ఎండీ ఐలీల్, వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ లింగాల బిక్షమయ్య, వెల్మజాల సర్పంచ్ సంగ బాలకృష్ణ, ఎంపీటీసీ సంగి అలివేలు, సీతారాంపురం సర్పంచ్ మలిపెద్ది మాధవి, ఎంపీటీసీ కేమిడి అనిత, తహసీల్దార్ వి.దయాకర్ రెడ్డి, ఎంపీడీవో పుష్పలీల, వ్యవసాయ అధికారి డి.సంతోషి, ఏపీఎం రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రారంభానికి సిద్ధమవుతున్న బుద్ధవనం.. 15లోగా పనులు పూర్తి!