తెలంగాణ

telangana

ETV Bharat / state

కష్టం నేలపాలు... పంట నీటిపాలు - grain drenched in bhuvanagiri due to rain

యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యమంతా తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Breaking News

By

Published : May 17, 2020, 11:36 AM IST


యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం, రాజపేట మండలాల్లో శనివారం సాయంకాలం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులలకు రాజపేట మండలంలోని మామిడి కాయలు నేలరాలాయి.

మేడిపల్లి, రాంలింగంపల్లి, మర్యాల ,చీకటిమామిడి, చౌదర్ పల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా నీటిపాలైందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details