తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి జిల్లాలో 472 మిల్లీమీటర్ల వర్షపాతం - తెలంగాణలో భారీ వర్షాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి అక్కడక్కడా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 472.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.

Telangana news
యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు

By

Published : Jun 4, 2021, 11:47 AM IST

రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి 472.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భూదాన్ పోచంపల్లి మండలంలో 135.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా రామన్నపేట మండలంలో 05.0 మిల్లీమీటర్లు కురిసింది.

భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లి మండలం గౌసుకొండ, శివారెడ్డి గూడెం, రామలింగం పల్లి, దోతి గూడెంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వలిగొండ, బీబీనగర్, భువనగిరి మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలు చోట్ల రైతులు అప్రమత్తమై ధాన్యాన్ని టార్పాలిన్లతో కప్పి జాగ్రత్తపడ్డారు.

ఇదీ చూడండి:Paddy Purchase :వానాకాలమొచ్చినా.. కల్లాల్లోనే యాసంగి పంట

ABOUT THE AUTHOR

...view details