యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ - governor tamilisai
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై దంపతులు దర్శించుకున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు.
![యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ Governor who made special worship](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5316396-627-5316396-1575882173179.jpg)
యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు పండితులు వేదమంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనాలు అందజేశారు. యాదాద్రికి తొలిసారి విచ్చేసిన గవర్నర్కు మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్