Governor Tamilisai Soundararajan visits yadadri: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యాదాద్రి క్షేత్రానికి వచ్చారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత తదితరులు గవర్నర్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. యాదాద్రి ప్రధానాలయాన్ని సందర్శించారు. స్వయంభు మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్ ప్రధాన ఆలయ పనులను పరిశీలించారు. అనంతరం బ్రహ్మోత్సవాలలో భాగంగా బాలాలయంలో నిర్వహిస్తున్న స్వామివారి వటపత్రశాయి సేవలో పాల్గొన్నారు.
యాదాద్రిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతంగా...
'తమిళవాసినైనా గత రెండేళ్లుగా తెలంగాణ జనాలతో మమేకమై సంబంధాలు కొనసాగిస్తున్నాను. ప్రజలూ నా పట్ల అంతే అప్యాయత చూపిస్తున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంపై ఇప్పటికే నా వివరణ ఇచ్చాను. ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరేలా ఉండాలి. యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతంగా ఉంది. రానున్న రోజుల్లో గొప్ప ఆలయంగా నిలుస్తుంది. నరసింహ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాను.'
-గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
యాదాద్రిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇదీ చదవండి:Yadadri Prasadam: యాదాద్రి ప్రసాదంలో గాజుముక్క