Governor Tamilisai visit Bibinagar AIIMS : కేంద్రప్రభుత్వం వైద్య విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీ నగర్ ఎయిమ్స్‌ని ఆమె సందర్శించారు. 2021 - 2022 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు నిర్వహించిన వైట్ కోర్ట్ సెర్మని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులకు వైట్ కోట్‌ను ధరింపజేశారు. ఎయిమ్స్ అధికారులు బీబీ నగర్ ఎయిమ్స్ ప్రగతి నివేదికను వీడియో ద్వారా వివరించారు. భవిష్యత్‌లో బీబీ నగర్ ఎయిమ్స్ ఎలా రూపొందనుందో వీడియో ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ తమిళిసై వీక్షించారు.
రోగులతో ఎక్కువ మాట్లాడాలి..
తన అనుభవాలను వైద్య విద్యార్థులతో గవర్నర్ తమిళిసై పంచుకున్నారు. తన భర్త నెఫ్రాలజిస్ట్ అని, తాను గైనకాలజిస్ట్ అని వెల్లడించారు. గర్భిణిలు ఐరన్ మాత్రలు వేసుకుంటే మంచిదని... కానీ పుట్టే పిల్లలు నల్లగా అవుతారని వారు పడేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాళ్లకు అవగాహన కల్పించాలని సూచించారు. రోగులతో ఎక్కువ మాట్లాడాలని అన్నారు. వారు చెప్పే విషయాల ద్వారా ఎక్కువ నేర్చుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా రోగ లక్షణాల గురించి ఎక్కువ నేర్చుకోవాలని యువ వైద్యులకు సూచించారు.
పరిశోధనలు చేయాలి..