యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పోలీస్ ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభోత్సవానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉచిత శిక్షణ తరగతులని ప్రారంభించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతోనే సెంటర్ మంజూరైందని తెలిపారు.
ఉచిత పోలీస్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ - gongidi sunitha reddy launches free police training camp news
ఆలేరు పట్టణ కేంద్రంలో ఉచిత పోలీస్ శిక్షణ శిబిరాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతోనే సెంటర్ మంజూరైందని తెలిపారు. ఈ ఉచిత శిక్షణ ద్వారా పోలీస్తోపాటు ఆర్మీ ఉద్యోగాలకు కూడ సన్నద్ధం కావాలని అభ్యర్థులకు ఆమె సూచించారు.

ఉచిత పోలీస్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్
ఈ ఉచిత శిక్షణ ద్వారా పోలీస్తోపాటు ఆర్మీ ఉద్యోగాలకు కూడ సన్నద్ధం కావాలని ఆమె అభ్యర్థులకు సూచించారు. మూడు నెలలు కష్టపడితే ఉద్యోగం సాధించవచ్చన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ శిక్షణ కోసం పీఈటీలు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ వస్పరి శంకరయ్య, యాదగిరిగుట్ట రూరల్ సీఐ నర్సయ్య, ఆలేరు పట్టణ ఎస్ఐ రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ప్రేమ.. పెళ్లి.. కౌన్సెలింగ్.. లొల్లి.. హత్య.. ఆత్మహత్య
TAGGED:
telangana news