యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో 610 సర్వే నెంబరు గల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించి ప్రైవేటు కళాశాల, ఫంక్షన్‌హాల్ నిర్మించారు. గత సంవత్సరం స్థానికులు ఆ భూమిని కాపాడాలంటూ భువనగిరి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఆ స్థలాన్ని సర్వే చేయించి.. హద్దులు నిర్ణయించి ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని అధికారులు నోటీసులు పంపించారు. కబ్జాదారులు సైతం 610 సర్వే నెంబర్ తమదేనంటూ హైకోర్టును ఆశ్రయించారు. సదరు భూమిపై హైకోర్టు స్టే ఇచ్చింది.
కబ్జాదారుల చెర నుంచి ప్రభుత్వ భూమికి విముక్తి - Yadadri Bhuvanagiri News
ప్రభుత్వ భూమిని కాపాడాలని.. అవసరమైతే.. పుస్తెలతాడు.. గాజులు, సెల్‌ఫోన్ ఇస్తామని కొంతమంది మహిళలు రెవెన్యూ అధికారులను ప్రాధేయపడ్డ సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ భూమి విషయమై అధికారులు ఎట్టకేలకు సమస్య పరిష్కరించారు. ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి విముక్తి కలిగించారు.
కబ్జాదారుల చెర నుంచి ప్రభుత్వ భూమికి విముక్తి
హైకోర్టు ఇచ్చిన స్టే గడువు పూర్తి అయిన తరువాత మోత్కూరు తహసీల్దార్ షేక్ అహమ్మద్ 610 సర్వే నెంబర్ లో గల భూమిలో అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించాలని.. లేనిచో ప్రభుత్వమే తొలగిస్తుందని నోటీసులు పంపారు. అయినా.. వారు నిర్మాణాలను తొలగించలేదు. ఆగ్రహించిన తహశీల్దార్ స్థానిక ఎస్సై హరిప్రసాద్ సహకారంతో జేసీబీతో అక్రమ నిర్మాణాలను తొలగించారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా