యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆంజనేయ స్వామి ఆలయానికి అండర్ పాస్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. వైకుంఠ ద్వారం పక్క నుంచి వలయ రహదారి వస్తుండటం వల్ల గుడికి వచ్చే భక్తులకు ఇబ్బందవుతుందని కొంత కాలంగా హిందూ సంస్థలు ఆందోళనలు చేస్తున్నాయి.
యాదగిరిగుట్టలో అండర్ పాస్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ - yadagirigutta hanuman temple
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆంజనేయస్వామి ఆలయానికి అండర్ పాస్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినట్లు రోడ్లు భవనాల శాఖ డీఈ బిల్యానాయక్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి చొరవతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు.
అండర్ పాస్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన సర్కార్ అండర్ పాస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అండర్ పాస్ పనులు శనివారం నుంచి ప్రారంభించినట్లు రోడ్లు, భవనాల శాఖ డీఈ బిల్యా నాయక్ తెలిపారు. మరో 15 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. అండర్ పాస్ నిర్మాణానికి అనుమతి రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
- ఇదీ చదవండి :ఇహానికి... పరానికి రంగుల పున్నమి!