యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు కనిపించేలా బీసీ సంఘం నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు అమ్మాయిలను హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని విజ్ఞప్తి చేశారు.
'గవర్నర్ కాన్వాయ్ ఎదుట ప్లకార్డులతో నిరసన' - యాదగిరి గుట్ట తాజా వార్త
యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకుని వెళ్తున్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను బీసీ సంఘాల నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. హాజీపూర్ ఘటనలోని నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు.
'గవర్నర్ కాన్వాయ్ ఎదుట ప్లకార్డులతో నిరసన'
కాన్వాయ్‌లో వెళ్తున్న గవర్నర్‌కు కనిపించే విధంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. దిశ హత్య కేసులో నిందితులను శిక్షించినట్టుగా వెంటనే మర్రి శ్రీనివాస్ రెడ్డిని శిక్షించాలని కోరారు.
ఇదీ చూడండి: గవర్నర్ వరంగల్ పర్యటన ఖరారు