తెలంగాణ

telangana

ETV Bharat / state

హేమలత కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత - government whip gongidi sunitha at motakonduru

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ గ్రామంలో ముదిరాజ్ హేమలత కుటుంబాన్ని పరామర్శించి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం గ్రామంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేశారు.

gongidi sunitha tour at chada village
హేమలత కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత

By

Published : Aug 1, 2020, 9:53 PM IST

హైదరాబాద్ ఎల్బీనగర్​లో కామాంధుడు వెంకటేశ్వరరావు చేతిలో హత్యకు గురైన హేమలత కుటుంబసభ్యులను ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్​ రెడ్డి పరామర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ గ్రామంలో ఉన్న వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.

హేమలత కుటుంబసభ్యుల గురించి అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత గ్రామంలో ఇటీవల కులాంతర వివాహం చేసుకున్న జంటను కలిసి వారికి అభినందనలు తెలిపారు.

ఇదీ చూడండి:ప్రముఖుల ట్విట్టర్​ ఖాతాలను ఎలా హ్యాక్ చేశారంటే?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details