యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత నిత్యావసర సరుకులను అందజేశారు. తన భర్త టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా హీల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గంలో ఉన్న వెయ్యి 936 మంది ముస్లిం కుటుంబాలకు తానే స్వయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
భర్త పుట్టినరోజున పేదలకు నిత్యావసరాల పంపిణీ - gongidi sunitha distributed daily commodities
దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ఘటన జరగకపోతే దేశంలో కరోనా ఇంతలా విజృంభించేది కాదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. భర్త మహేందర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు.

భర్త పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర సరుకుల అందజేత
కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా గొప్పగా పని చేశాయని సునీత వెల్లడించారు. కొవిడ్-19 నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఏది పాటించమంటే అది పాటించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఇప్పటివరకు యాదాద్రి జిల్లా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: హైదరాబాద్‌లోనూ ఆయువు తీసే వాయువులెన్నో?